- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పల్లా’ కాలేజీలో బోగస్ ఓట్లు : తీన్మార్ మల్లన్న
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దాని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్‌ను మంగళవారం కలిసి బోగస్ ఓట్ల వివరాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పల్లాను ఈ ఎన్నికల నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మల్లన్నే గెలుస్తాడని అన్ని సర్వేలు చెబుతున్నాయని అందుకే టీఆర్ఎస్ నాయకులు బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులను, ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం భయపెడుతోందని, వారందరికీ అండగా ఉండి కాపాడుకుంటానని స్పష్టం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారిని పోలీసులకు పట్టించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ పట్టించుకోకుంటే హైకోర్టుకు వెళ్లేందుకూ సిద్ధమేనని ఆయన వెల్లడించారు.