- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ప్లేట్లు పట్టుకుని తిరిగారు తప్పా పల్లా చేసిందేమి లేదు’
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: ఆంధ్రోళ్ల కన్నా కేసీఆర్ కుటుంబం అత్యధికంగా దోచుకుని దాచుకుంటోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇంచార్జ్ బొడిగ శోభ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాలు, సబ్బండ కులాల ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ.. ఆంధ్రుల కబంధ హస్తాల నుంచి బయటపడి కల్వకుంట్ల వారి కుటుంబంలో చిక్కింది అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని అన్యాయం జరిగిందని.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రతి సభలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబానికి ఉద్యోగాలు తెచ్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాదికి లక్ష ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై పదేళ్లు అధికారంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కేసీఆర్ ఇంట్లో పళ్లాలు( ప్లేట్లు) పట్టుకు తిరుగుతారు తప్ప ఒక్క ఉద్యోగం ఇప్పించ లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ దయతో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకొని అడ్డంగా సంపాదించుకుంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులు ఉద్యోగస్తులు ఆలోచించి ప్రజల పక్షాన నిలిచి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.