- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్వకుంట్ల సంచులు మోస్తున్న బాల్క సుమన్.. బొడిగె శోభ ఆరోపణలు
దిశ, జమ్మికుంట: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దళిత ద్రోహి, కల్వకుంట్ల ఏజెంట్ అంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నేత దరువు ఎల్లయ్యలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే.. బాల్క సుమన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
కేసీఆర్‌కు జేజేలు కొట్టడం తప్పా.. ఏనాడైనా విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడవా సుమన్ అంటూ.. బొడిగె శోభ విరుచుకుపడ్డారు. సునీల్ నాయక్ చనిపోతే ఎందుకు పరామర్శించలేదని.. హుజురాబాద్‌లో ఏం చేస్తున్నావని నిలదీశారు. బీజేపీ పిలుపునిస్తే నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాదు.. నీ నియోజకవర్గం నుంచి కూడా బయటకురావని బొడిగె శోభ హెచ్చరించారు. బండి సంజయ్ విహార యాత్రలు చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.. విహార యాత్రలు చేసేది బండి సంజయ్ కాదు.. కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్‌లు చేస్తున్నారన్నారు. వాళ్ళ సంచులు మోస్తున్న నీకు వారి గురించి బాగా తెలుసు కదా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.