మరోసారి ధర్మేంద్రతో సన్నీ, బాబీ

by Shyam |
మరోసారి ధర్మేంద్రతో సన్నీ, బాబీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో ధర్మేంద్ర తన ఇద్దరు కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో కలిసి నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ఆప్నే’. 2007 విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఇన్నాళ్లకు దీనికి సీక్వెల్ రాబోతుంది. కాగా మరోసారి ఈ ముగ్గురు కలిసి ‘ఆప్నే 2’లో నటించబోతున్నట్లు బాబీ డియోల్ తెలిపాడు. ఆప్నే సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ శర్మనే ‘ఆప్నే2’ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్‌లు కలిసి చివరి సారిగా 2018లో వచ్చిన ‘యమ్లా పగ్లా దివానా’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ధర్మేంద్ర వయసు 85 సంవత్సరాలు. కాగా ‘ఆప్నే 2’ చిత్రం 2021లో విడుదలవుతుందని తెలిపాడు.

‘మా మధ్య ఉన్న కెమిస్ట్రీనే ఆప్నే సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. మేము తీసే ఫ్యామిలీ డ్రామాలోనూ మా ఎమోషన్స్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కుటుంబ అనుబంధాలే అప్నే యూఎస్‌పీ. పప్పా, భయ్యాలు మరోసారి తెరమీద కనిపిస్తే.. ఆడియన్స్ సంతోషపడతారు’ అని బాబీ డియోల్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed