బీఎమ్‌డబ్ల్యూ నుంచి ప్రీమియం బైక్ విడుదల!

by Harish |
BMW M1000 RR
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ఇండియా గురువారం తన ప్రీమియం మోటార్‌సైకిల్ మోడల్ బీఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 42 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమియం ఫీచర్లతో లభించే ఈ బైక్ నాలుగు రకాల రైడింగ్ మొడ్స్‌లో లభించనుంది. భారత్‌లోని బీఎమ్‌డబ్ల్యూ నుంచి వచ్చిన మొదటి ‘ఎమ్ మోడల్’ బైక్ ఇదని, దీన్ని బీఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చని బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. ఈ మోటార్‌సైకిల్ బీఎమ్‌డబ్ల్యూ రెండు వేరియంట్లలో లభించనుండగా, ఎమ్ 1000 ఆర్ఆర్ ధర రూ. 42 లక్షలు ఉండగా, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ కాంపిటీషన్ ధర రూ. 45 లక్షలతో లభిస్తుంది.

‘సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ మెరుగైన పనితీరుతో, రేస్ బైక్ అనుభూతిని ఇస్తుంది. ఈ సరికొత్త మోడల్‌లో శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అధునాతన డైజైన్, ప్రత్యేకమైన పరికరాలతో తయారు చేయబడిందని’ బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా చెప్పారు. 999 సీసీ, 4-సిలిండర్ ఇంజిన్‌తో నడిచే బీఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ 0-11 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకెన్లలో అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 3.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. ఇది రెయున్, రోడ్, డైనమిక్, రేస్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్‌లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed