వేములవాడలో క్షుద్రపూజల కలకలం

by  |
వేములవాడలో క్షుద్రపూజల కలకలం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మూఢనమ్మకాలు నమ్మేవారు ఉన్నంత కాలం మోసం చేసే కొత్త బాబాలు పుట్టుకస్తూనే ఉంటారు. అమాయక ప్రజల ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకొని భూతవైద్యం పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు నయం చేస్తానంటూ ఓ భూత వైద్యుడు క్షుద్ర పూజలు చేశాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం వెలుగుచూసింది.

జిల్లాలోని వేములవాడ మండలం అగ్రహారం గుట్టలో పెద్దూర్‌కు చెందిన ఓ నకిలీ బాబా బాగోతం బయటపడింది. అమాయక కుటుంబానికి మాయమాటలు చెప్పి అగ్రహారం గుట్టల్లోకి తీసుకువచ్చాడు. అనారోగ్య సమస్యలను భూత వైద్యం పేరుతో నయం చేస్తానంటూ క్షుద్ర పూజలు మొదలెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు గుట్టల్లోకి వెళ్లి వారిని పట్టుకున్నారు.

కొందరు వ్యక్తులు వారిని చూసి వీడియోలు కూడా తీశారు. ఇక్కడ ఏం మంత్రాలు చేస్తున్నారంటూ భూతవైద్యడిని నిలదీయడంతో అక్కడి నుంచి భూత వైద్యుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారయ్యారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed