- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ రోగుల తాకిడి
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ రోగుల రద్ధీ మళ్లీ పెరిగింది. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1500 పడకలు అందుబాటులోకి తెచ్చినప్పటికీ నోడల్ హాస్పిటలైన ఈఎన్‌టీలో రోగులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే హాస్పిటల్‌లో 300 మంది రోగులు ఇన్ పేషంట్లుగా వైద్య సేవలు పొందుతుండగా అనేక మంది రోగులు ఇన్ పేషంట్లుగా చేరేందుకు ఎదురు చూస్తున్నారు. ఈఎన్‌టీతో పాటు గాంధీ, కింగ్ కోఠి, నిలోఫర్, సరోజినీ తదితర ఆస్పత్రులలో కూడా బ్లాక్ ఫంగస్ వ్యాధికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అయినా రోగులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఆస్పత్రిలో మంచాలు పూర్తి స్థాయిలో రోగులతో నిండి ఉన్నాయని వైద్యులు, సిబ్బంది సూచిస్తున్నా వారు ఇతర ఆస్పత్రులను వదిలి ఈఎన్‌టీలోనే చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా హాస్పిటల్‌లో ఇప్పటికే మూడు ఎండోస్కోపి పరికరాలు అందుబాటులో ఉండగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మరో ఎండోస్కోపిని అందుబాటులోకి తెచ్చారు. దీంతో వీటి సంఖ్య 4కు చేరింది.