- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డిలో బస్టాండ్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన
దిశ, కామారెడ్డి రూరల్: పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ..పెట్రోల్, డీజీల్ పై అధిక పన్నులను వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెను భారంగా మారిందని అన్నారు. పెట్రోల్ పై 35 శాతం, డీజిల్ పై 22 శాతం వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల భారం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల తగ్గించారని అన్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువ వాటా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.