- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టీడీపీ, వైసీపీ దొందూ దొందే.. బీజేపీనే గెలిపించండి’
దిశ, ఏపీ బ్యూరో: బద్వేల్ ఉపఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. సిద్ధాంతపరమైన విధానం ప్రకారం కేవలం బీజేపీ పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ కాలంలో నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం, వైసీపీ ఏవిధంగా వ్యవహరించాయో.. ప్రస్తుతం బద్వేల్ ఎన్నికలలో ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలే ఆలోచన చెయ్యాలని పిలుపునిచ్చారు. మోర్చా పదాధికారులు, సెల్స్ అండ్ డిపార్ట్ మెంట్స్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన బద్వేల్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్ గెలుపుకోసం ప్రతీఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వెల్లడించారు. టిడ్కో ఇళ్ళు విషయంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పేరుతో రాష్ట్రంలో 20′ రోజులు సేవా కార్యక్రమాలు చేశామని ఏపీ చరిత్రలోనే అదొక అరుదైన ఘట్టం అని అభివర్ణించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ సహ ఇన్‌చార్జీ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.