సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : బండి సంజయ్

by Sridhar Babu |   ( Updated:2020-08-16 09:31:43.0  )
సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : బండి సంజయ్
X

దిశ, మానకొండూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయికుమార్ ఆదివారం మానకొండూరు మండలంలోని ఈదులఘట్ట పెళ్లి గ్రామంలో పర్యటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు గ్రామంలో చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి.

దీంతో గ్రామంలోని కొన్ని ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ భవనం సైతం మునిగిపోయే దశలో ఉందని, వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed