భూసార పరీక్షలు చేయలేదు : బండి సంజయ్

by Anukaran |
భూసార పరీక్షలు చేయలేదు : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించారు. గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు జలమయమైన ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాల వల్ల పంటనష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూసార పరీక్షల కోసం కేంద్రం రూ.125 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. అయినా తెలంగాణలో ఎక్కడా భూసార పరీక్షలు చేయలేదని విమర్శించారు. క్వింటాల్ వరికి రూ.1880ల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story