- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిచే స్థానాలపైనే బీజేపీ ఫోకస్.. మున్సి‘పోల్స్’లో ‘బండి’ టార్గెట్ మిస్సవ్వదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీకి మున్సిపల్బెంగ పట్టుకుంది. వరుసగా ఎదురవుతున్న ఓటములతో కమలనాథులు మున్సిపల్ ఎలక్షన్స్‌లో కొంత జాగ్రత్తగా ముందుకెళ్లాలని ప్రణాళికలు రూపొందించు కున్నారు. ఈ నెల 30న జరగనున్న 2 కార్పొరేషన్, 5 మున్సిపాలిటీల్లో గెలుపు అవకాశాలున్న ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. ఇటీవల రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్సిట్టింగ్స్థానాన్ని కూడా ఆ పార్టీ పొగొట్టుకుంది. ఇక వరంగల్ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థి పల్లాకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. ఈ నెల 17న సాగర్ కు జరిగిన ఉప ఎన్నికలపై కూడా కమలనాథులకు తాము గెలుస్తామనే అంచనాలు పెద్దగా లేవని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే అంతకు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీ కొంత దూకుడు ప్రదర్శించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవశం చేసుకోవడంతో పార్టీలో కొంత జోష్ వచ్చింది. అనంతరం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లోనూ 150 స్థానాలకు గాను 48 సీట్లను గెలుచుకొని రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందనే సంకేతాలను అధికార పక్షానికి పంపింది. దీంతో ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జరగబోయే మున్సిపల్ఎన్నికల్లోనూ మరోసారి బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఆ ప్రభావం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంపై పడొచ్చని కమలనాథులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఇతర పార్టీల నుంచి వలసలు కూడా తగ్గొచ్చని పార్టీ భావిస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కమలనాథులు ఆచితూచి ముందుకుపోతున్నట్లు సమాచారం. ఏలాగో గెలువని ప్రాంతాలపై ఫోకస్‌పెట్టి ఓటమి పాలై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే బదులు కొంత సక్సెస్ అవకాశాలున్న కార్పొరేషన్లు, మున్నిపాలిటీల్లో బలంగా ఉన్న స్థానాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది.
ఈసారి వానాకాలంలో జీహెచ్ఎంసీలో కురిసన వర్షాల కారణంగా గ్రేటర్లో విపరీతమైన వరదలతో నగరం బాగా దెబ్బతింది. ఈ ఎఫెక్ట్జీహెచ్ఎంసీ కార్పొరేషన్ఎలక్షన్స్లో బీజేపీకి కలిసోచ్చిందనే భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. అయితే గ్రేటర్హైదరాబాద్లో ఉత్పన్నమైన పరిస్థితులు వరంగల్బల్దియాలో కూడా పునారావృతం అయ్యాయి. వరదల వల్ల వరంగల్ నగరమూ బాగా దెబ్బతింది. ఈ అవకాశాన్ని కమలనాథులు వరంగల్ కార్పొరేషన్ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్‌కూడా వరంగల్ బల్దియాపైనే ఎక్కువ ఫోకస్పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్ఈ నెల 27 వరకు మున్సిపల్ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సంజయ్శనివారం వరంగల్ కార్పొరేషన్లో 13 వార్డులను కవర్ చేస్తూ రోడ్డు షో నిర్వహించారు. ఆదివారం సెంట్రల్ఫండ్స్పై మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు వివరించనున్నారు.
సోమ,మంగళవారాల్లో కూడా హన్మకొండ, వరంగల్‌లలో సంజయ్ఎన్నికల టూర్ఉంది. సిద్దిపేట, ఖమ్మంలోనూ సంజయ్క్యాంపెయిన్ ఉన్నప్పటికీనామ మాత్రంగానే ఆయా ప్రాంతాల్లో ప్రచారం జరగనున్నట్లు సమాచారం. సిద్దిపేటలో కొన్ని స్థానాల్లోనైన బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఖమ్మంలో బీజేపీకి పెద్ద ఆశలు లేవనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అందుకే అవకాశాలు లేని దగ్గర ప్రచారాన్ని చేసే బదులు చాన్సెస్ఉన్న ఏరియాల్లో ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించుకొని పార్టీ పట్టును కాపాడుకోవచ్చని భావిస్తోంది. వెరసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, సాగర్‌లోనూ ప్రతికూల సిచ్యూయేషన్ఉండొచ్చని కథనాల నేపథ్యంలో మున్సిపల్‌ఎన్నికల్లో తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచనలో కమలనాథులున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో పార్టీపై నెగెటివ్వేవ్ ప్రజల్లోకి వెళ్లదని ఎక్స్‌పెక్ట్ చేస్తు్న్నారు.