- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఫాంహౌస్‌ను తనిఖీ చేయాలి: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాంహౌస్ సీఎంగా సెటిలయ్యారని, అందుకే ఫౌంహౌస్ దాటి బయటకు రావట్లేదని విమర్శించారు. డీజీపీ హౌంహౌస్‌ను తనిఖీ చేస్తే ఏదో ఒకటి బయట పడుతుందన్నారు. రాష్ట్రంలో దేవాలయ స్థలాలను టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్‌కు వచ్చిన రైతులపై దౌర్జన్యం చేయడం సరికాదన్న బండి సంజయ్.. టీఆర్ఎస్ వాళ్లపై దాడి చేసే సత్తా మాకూ ఉందన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించిన బండి సంజయ్… ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలను సీఎం కేసీఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిందని, పోలీసులు స్వేచ్ఛగా డ్యూటీ చేయలేక పోతున్నారన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ పై విధంగా వ్యాఖ్యానించారు.