కేసీఆర్‌కు పేను కుట్టినట్టైనా లేదు: బండి సంజయ్

by Shyam |
కేసీఆర్‌కు పేను కుట్టినట్టైనా లేదు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: పీఆర్సీ విషయంలో ఉద్యోగులు రగిలిపోతుంటే సీఎం కేసీఆర్‌కు పేను కుట్టినట్టైనా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పాలాభిషేకాల కోసం తాపత్రయ పడే కేసీఆర్ తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలతోనే సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బిశ్వాల్‌ రిపోర్టుపై అభిప్రాయ సేకరణకు పిలుస్తున్నారన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటర్లు చేసిన పాలాభిషేకం కేసీఆర్‌కు సరిపోనుట్లుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

7.5% ఫిట్‌మెంట్‌ను ముందుపెట్టి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ సమస్యలను తెరపైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు కల్పించాల్సిన EHS అమలు కావడం లేదని, కరోన బాధిత ఉద్యోగులకు రూ.లక్ష సాయంపై చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల భార్యభర్తల ట్రాన్స్‌ఫర్‌లు ఇంకెప్పుడు చేపడుతారని, ఇవన్నీ త్రిసభ్య కమిటీ ముందుకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై గొంతెత్తితే కేసులతో బెదిరిస్తున్నారని, ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story