- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎంసీలో చేరిన భార్య.. విడాకులిస్తానంటున్న ఎంపీ
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ సుమిత్రా ఖాన్ సతీమణి సుజాత మండల్ ఖాన్ టీఎంసీలో చేశారు. సోమవారం తృణముల్ ఎంపీ సౌతతారాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో ఆమె టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కోసం కష్టపడి పని చేశాను.. కానీ ఆ పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయింది. ఒక మహిళగా ఆ పార్టీలో ఉండలేకపోతున్నాను అని అన్నారు. అవినీతిపరులకు గాలం వేసి బీజేపీ పార్టీ బలపడేందుకు యత్నిస్తోందన్నారు. బెంగాల్‌లో బీజేపీకి సీఎం అభ్యర్థే లేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ కోసం పని చేయడం ఒక మహిళగా తనకు గౌరవం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే భార్య సుజాత మండల్ టీఎంసీలో చేరడంపై ఎంపీ సుమిత్రా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అని సంచలన ప్రకటన చేశారు. తన భార్య తీసుకున్న నిర్ణయానికి తనకు సంబంధం లేదని అన్నారు.