- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీది కౌరవసేన.. మాది రామదండు
దిశ, ఆదిలాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై దాడులు చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కౌరవసేనతో పోల్చారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు బీజేపీ భయపడదన్నారు. అరవింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోనూ బలపడుతుందని, దీన్ని తట్టుకోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో ఉన్నవారంతా రామదండు లాంటివారని చౌకబారు రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ఎంపీ అరవింద్‌పై దాడి చేశారని విమర్శించారు. ఒక పార్లమెంటు సభ్యుడికే తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీ ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడి కేసులో దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తలు సైతం తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.