చివరికి ముఖ్యమంత్రి మొహం కూడా చెల్లక..

by Shyam |
BJP MLA Raghunandan Rao
X

దిశ, నాగర్ కర్నూల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన దాడిపై ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కొంతమంది జర్నలిస్టు కుటుంబాలకు డబ్బులు పంచి ప్రేమ ఒలకబోసారని ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని కేటీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. తెలంగాణలో అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత, కొడుకు కేటీఆర్, చివరికి సీఎం కేసీఆర్ మొహం కూడా చెల్లక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణి దేవిని ఎమ్మెల్సీ బరిలో దింపారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story