కార్పొరేషన్ నిధులకు గండి.. కమిషనర్‌పై బీజేపీ నేతల ఆగ్రహం

by Shyam |
BJP leaders protest
X

దిశ, మేడిపల్లి: పీర్జాదిగూడ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు అనిల్ రెడ్డిలు అన్నారు. గతకొన్ని రోజులుగా కార్పొరేషన్‌లో జరిగిన పలు అక్రమాలపై కమిషనర్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేదని, కళ్ళముందే కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో కమిషనర్ విఫలం చెందారని విమర్శించారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం కార్పొరేషన్ ఆఫీసు ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోందని తెలిసినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పాలకులతో కుమ్మక్కై ఇద్దరు కలిసి పెద్ద మోసానికి తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికైనా వారి తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్నాలో పీర్జాదిగూడ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, పవన్ రెడ్డి, సుధారాణి, సుధాకర్, సుజాత, కరుణాకర్ రెడ్డి, మహేందర్, నవీన్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed