రాష్ట్రంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులు

by Shyam |
రాష్ట్రంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులు
X

దిశ, సికింద్రాబాద్: పాత సెక్రెటేరియట్‌లోని నల్లపోచమ్మ ఆలయం కూల్చివేతను నిరసిస్తూ బీజేపీ నగర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పలుచోట్ల నాయకులు నిరసనకు దిగారు.మంగళవారం డీడీ కాలనీలో ఉన్నటువంటి నల్ల పోచమ్మ తల్లి ఆలయం వద్ద బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, ఆనాటి నిజాం పాలనని గుర్తు చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. ఆనాడు తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు ఎలాగైతే ఎదురుతిరిగారో ఇప్పుడు కూడా ఆ సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ సెక్రెటేరియట్‌లో తిరిగి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అజయ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.

బౌద్ధనగర్‌లో..

సెక్రెటేరియట్‌లో అమ్మవారి ఆలయం ధ్వంసమైన కారణంగా బీజేపీ అధిష్టానం పిలుపుమేరకు బౌద్ధనగర్
డివిజన్‌లో దుర్గామాత దేవాలయంలో డివిజన్ అధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్, దత్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ధ్వంసానికి కారకులైన తెలంగాణ ప్రభుత్వ పాలకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed