- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత్తర బిత్తర.. గందరగోళానికి మారుపేరు టీఆర్ఎస్ సర్కార్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కీలక బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ‘‘తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం.. సిబ్బంది నియామకం అంటూ ఆదేశాలిచ్చారు. ప్రజారోగ్యం పట్ల సీఎం గారికి అంత శ్రద్ధ ఉంటే… కరోనా పీడిస్తున్న గత ఏడాది కాలంలోనే ఈ పనులు ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు.
ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది నియామకం అంటూ ఆదేశాలిచ్చారు. పీఎంఎస్ఎస్వై కింద ఎంజిఎంలోను, రిమ్స్లో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి….
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 9, 2021