కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు

by Shyam |
కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు
X

దిశ, చెన్నూరు: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై భాజపా పోరాడుతుందని, రాబోయే కాలంలో అధికార పార్టీ అడ్రస్ కూడా ఉండబోదన్నారు. ఈ కార్యక్రమంలో లో పట్టణ అధ్యక్షుడు సుశీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్, జూల లక్ష్మన్, చింతల శ్రీనివాస్, బానే ష్ అంకిత శర్మ, ఆలం బాపు , పాల్గొన్నారు.

Advertisement

Next Story