వంగవీటి రాధా జోలికి వస్తే అంతు చూస్తా.. ప్రత్యర్థులకు బీజేపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్ 

by srinivas |
Vangaveeti Narendra
X

దిశ, ఏపీ బ్యూరో: ‘నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారంటూ’ వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర గట్టిగా స్పందించారు. ‘నా తమ్ముడి జోలికి వస్తే వాళ్ల అంతు చూస్తా. రాధా టీడీపీలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. రంగా హత్యకు టీడీపీ కారణం కాదని నాడు రాధా అన్నాడు. అందుకే మా తమ్ముడు రాధా తో రాజకీయంగా విభేదించాను. మా మధ్య వంద ఉండొచ్చు.. కానీ మా జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఘాటుగా హెచ్చరించారు. మా విభేదాలు కేవలం రాజకీయాలకే పరిమితమని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంటికి పెద్దగా తనపై ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాధాను చంపుతామంటే చూస్తూ ఊరుకోబోనన్నారు. తమ్ముడికి, వంగవీటి కుటుంబానికి జరిగే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామని నరేంద్ర హెచ్చరించారు.

తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఏ క్షణమైనా వచ్చి అండగా నిలబడతానని.. ఈ విషయాన్ని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధా తో దూరంగా ఉంటున్న నరేంద్ర.. కీలక సమయంలో రాధాకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో రంగా-రాధా మిత్రమండలి, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే గుడ్లవల్లేరు సభలో వంగవీటి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా మాట్లాడుతూ, తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపోతే వంగవీటి నరేంద్ర 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story