- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరేండ్లైనా దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదు.
దిశ, దుబ్బాక:
సిద్దిపేట ఒక కన్ను ఐతే, దుబ్బాక మరో కన్ను అని చెప్పుకుంటున్న హరీశ్ రావుకు రాయపోల్ దళితుల గోడు కనిపిస్తలేదా అని మంత్రి హరీశ్ రావును బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు ప్రశ్నించారు. రాయపోల్ మండల కేంద్రంలో దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఉన్న ఇండ్లను కూల గొట్టారని ఆయన అన్నారు. కానీ మూడేండ్లు అయినా ఇప్పటి వరకూ డబుల్ బెడ్ రూమ్ లేదు, సింగిల్ బెడ్ రూమ్ లేదని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డెపల్లి, వీరారెడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలు దాటినా దుబ్బాక మాత్రం అభివృద్ధి కి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. దీనికి గల ఏకైక కారణం ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు పక్కనుండడమే అని అన్నారు. ఆరు సంవత్సరాల నుంచి దుబ్బాకలో హరీశ్ రావు కనిపించలేదనీ ఆయన చెప్పారు. కానీ ఉప ఎన్నికలు రాగానే ఇక్కడే మకాం వేసి, కుల సంఘాలను పిలుచుకొని ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుండి హరీశ్ రావు మంత్రి గా,కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నారనీ, కానీ దుబ్బాకను మాత్రం మరిచి పోయారని తెలిపారు. ఆరు సంవత్సరాలుగా దుబ్బాక అభివృద్ది చెందకుండా ఆపింది హరీశ్ రావు అని అన్నారు.