- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము ఇస్తామనలేదు.. చంద్రబాబే స్పెషల్ ప్యాకేజీ అడిగింది
దిశ,వెబ్‌డెస్క్: విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో హామీల్ని నెరవేర్చలేదంటూ కేంద్రంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. మేము ఏం చేయలేదో మీరు చెప్పండి పై వాళ్లతో మాట్లాడతామన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకుందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని పురందేశ్వరి చెప్పగా.. స్పెషల్ ప్యాకేజీ కాకుండా స్పెషల్ స్టేటస్ ఇవొచ్చు కదా అని మీడియా మిత్రులు అడగ్గా.., గత ప్రభుత్వం అడిగిందే ఇచ్చాం. మీరు ప్యాకేజీయే తీసుకోవాలని, మేము వాళ్లపై రుద్దలేదని గుర్తు చేశారు. పెట్రోల్ – డీజీల్ రేట్లు పెరగడంపై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని అడగ్గా.., పెట్రోల్- డీజిల్ రేట్ల పెరుగుదల విషయంలో కేంద్రం ట్యాక్సుల్ని తగ్గిస్తుంది. మరి రాష్ట్రప్రభుత్వాలు ఆ ట్యాక్సుల్ని తగ్గిస్తాయా అని పురందేశ్వరి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం మాట్లాడతామన్నారు. ప్రజల అభిప్రాయాన్ని కేంద్రానికి వివరిస్తామని హామీ ఇచ్చారు.