- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘KTR సీఎం అయ్యే అవకాశమే లేదు’
దిశ, వెబ్‌డెస్క్: అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకున్న ప్రతిపైసా బీజేపీ కార్యకర్తలు కక్కిస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా.. కొత్త కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలకు గడువు ఉంటే టీఆర్‌ఎస్‌కి ఒక్క సీటు కూడా రాకపోవని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా రానున్న రోజుల్లో కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుందని, అసలు కేటీఆర్ సీఎం ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎస్‌లో సంక్షోభం రావడం ఖాయమని గుర్తుచేశారు.