- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్వేరోస్’కు నిధులెక్కడి నుంచి వస్తున్నయ్
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా స్వేరోస్ కార్యక్రమాలున్నాయని, సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం స్వేరోస్ సంస్థ వ్యవహార శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేరోస్‌కు నిధులెక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని, సంస్థకు సంబంధించిన లెక్కలు మీరు తీస్తారా..? లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీసేలా చేయమంటారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే తన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పతనం అవడం ఖాయమన్నారు. స్వేరోస్ సంస్థ అంశాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.