ఈసీ ప్రకటన రోజే ఈటలకు బిగ్ షాక్.. కారెక్కిన కమలనాథులు

by Anukaran |
ఈసీ ప్రకటన రోజే ఈటలకు బిగ్ షాక్.. కారెక్కిన కమలనాథులు
X

దిశ, హుజురాబాద్: నియోజకవర్గ ఉపఎన్నిక షెడ్యూల్‌పై ఈసీ ప్రకటన విడుదల చేసిన రోజే ఈటల రాజేందర్‌కు సొంత నేతలు ఊహించని షాకిచ్చారు. బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజురాబాద్ పట్టణ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు విధించిందని.. కానీ, టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి నిబంధనలు లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసిందని ప్రశంసించారు. దీంతో పాటు ఉద్యోగ నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిందని.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినందున బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని, అలాగే బడుగు బలహీన వర్గాలకు చేసిందేమి లేదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం తాము పనిచేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed