- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కమలం చూపు ‘కడారి’ వైపు
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు కనీస పోటీ ఇవ్వలేకపోయిన నాగార్జునసాగర్‌లో ఎవ్వరినీ బరిలోకి దించితే బాగుంటుందనే దానిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బీసీ నేత అయిన కడారి అంజయ్యయాదవ్ వైపు బీజేపీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కడారి అంజయ్యయాదవ్ నియోజకవర్గ వ్యాప్తంగా తన కార్యచరణను అమలు చేస్తూ ముందుకు సాగుతుండడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సహాన్ని పెంచుతోంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఊపుతో ముందుకు..
వాస్తవానికి తెలంగాణలో బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిందనే చెప్పాలి. కానీ పార్లమెం టు ఎన్నికల్లో తన వైభవాన్ని చాటుకుంది. దీనికితోడు మూడు నెలల క్రితం జరిగిన దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడం తో బీజేపీకి మంచి ఊపు వచ్చిం ది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎన్నడూ లేని విధంగా దాదాపు 44 సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయంగా కన్పించింది. ఈ తరుణంలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మృతితో ఏర్పడిన నాగార్జునసాగర్ ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణ తెలంగాణలో కీలకంగా ఉండే నల్లగొండ జిల్లాలో బీజేపీ విజయం సాధించగలిగితే.. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషణ. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితోనే నాగార్జునసాగర్‌లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రత్యేకంగా రంగంలోకి దిగింది.
కులాల వారీగా ఓట్ల వివరాలు..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దాదాపు 2.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా నమోదవుతున్న ఓటర్లతో కలిపితే మొత్తం 2.2 లక్షల వరకు ఉంటారని అంచనా. గతంలో చేపట్టిన సర్వే ప్రకారం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 1.3 లక్షల మంది ఉంటే.. ఇందులో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 50 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్టీలు మరో 35 వేలు, రెడ్డి సామాజిక వర్గం 15 వేలు, కమ్మ వర్గం నుంచి 6 నుంచి 7 వేలు, మరో 20 వేల ఎస్సీ ఓట్లు ఉంటారని సమాచారం. ఇదిలావుంటే.. 2012 జనాభా లెక్కల ప్రకారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 47,464 మంది ఎస్సీలు, 49,107 మంది ఎస్టీలు ఉన్నారు.
కడారికి ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సన్నిహితం..
సాగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో టికెట్ ఆశించే వారిలో కడారి అంజయ్యయాదవ్, ప్రస్తుత నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితారెడ్డి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో నివేదితారెడ్డికి కేవలం 2640 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో కడారి అంజయ్యయాదవ్‌పై బీజేపీ ఫోకస్ చేసింది. 2019 ఆగస్టులో బీజేపీలో చేరిన కడారి అంజయ్యయాదవ్ నాటి నుంచి బీజేపీ నియోజకవర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు కడారి అంజయ్యకు ఉన్నాయి. ఆ వర్గాల్లో ప్రభావం చూపే నేతలంతా కడారి వర్గంలో ఉండడం.. ఆ విషయంపై ఇప్పటికే సమగ్ర సమాచారం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అందడంతో కడారి అంజయ్య యాదవ్‌కు మంచి అవకాశంగా మారింది. ఇదిలావుంటే.. ఇప్పటికే ఆయా పార్టీలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు.
కడారి వైపే ఎక్కువ ఆసక్తి..?
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బలమై న బీసీ సామాజిక నేతగా కడారి అంజయ్యయాదవ్‌కు తగిన గుర్తింపు ఉంది. అందులో నూ కడారి అంజయ్య.. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అతడికి మరింతగా కలిసొచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 27,852 ఓట్లను సాధించగలిగాడు. అనంత రం జరిగిన పరిణామాల నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో సాగర్ టికెటును బీజేపీకి కేటాయించారు. దీంతో అంజయ్య పోటీ చేయలే దు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన నివేదితారెడ్డి కేవలం 3 వేల లోపు ఓట్ల ను మాత్రమే పొందింది. దీంతో కనీస పోటీనివ్వలేకపోయారు. ఆ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని కడారి అంజయ్యయాదవ్‌ను రంగంలోకి దింపితే.. సాగర్‌ను కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయానికి బీజేపీ రాష్ట్ర నా యకత్వం యోచిస్తోంది.