రాసలీలల కహానీ: ఆ సీడీ విలువ రూ.20 కోట్లా?

by Anukaran |   ( Updated:2021-03-09 06:14:47.0  )
రాసలీలల కహానీ: ఆ సీడీ విలువ రూ.20 కోట్లా?
X

దిశ,వెబ్‌డెస్క్: శృంగార వీడియోలపై కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్ధులు తనని దెబ్బతీసేందుకు మహిళతో రూ.20కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై రమేష్ జార్కి హోళి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను చూసి సహించలేని ప్రత్యర్ధులే ఫేక్ బ్లూ ఫిల్మిం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. నేను చాలా ఇన్నోసెంట్ అంటూ కన్నీటి పర్యంతరమయ్యారు. నాలుగు నెలల క్రితమే ఈ సీడీల గురించి తెలుసని, అదే విషయాన్ని తన అన్న బాల చంద్ర జార్కిహోళి చెప్పినట్లు తెలిపారు. అంతకు మించి నేను ఎలాంటి తప్పు చేయలేదు. అంతేకాదు ఆ వీడియోలో ఉన్నది నేను కాదని పార్టీ హైకమాండ్ కు వివరించా. ఆ వీడియోల గురించి లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నట్లు రమేష్ జార్కిహోళి స్పష్టం చేశారు.

సీడీ విలువ 20కోట్లు

మహిళతో తాను సన్నిహితంగా ఉన్నట్లు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేందుకు రూ.20కోట్లు ఖర్చు చేశారని రమేష్ జార్కిహోళి అన్నారు. ఈ వీడియోల కోసం బెంగళూరులోని యశ్వంత్ పూర్,హులిమావు ప్రాంతాల్ని సెలక్ట్ చేసుకున్నట్లు తనకు సమాచారం ఉందన్న ఆయన.. ఈ వీడియోలో ఉన్న మహిళ ఆ సీడీ ఇచ్చినందుకు ప్రత్యర్ధులు ఆమెకు రూ.5కోట్ల క్యాష్, విదేశాల్లో రెండు ఫ్లాట్లు ఇచ్చారని చెప్పారు. తనని ఇరికించేందుకు ఓరియన్ మాల్ సమీపంలో ఉన్న ఓ ఫ్లాట్ లో ఈ డీల్ జరిగిందన్నారు. దీనివల్ల తన రాజకీయ భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే నా వ్యక్తిత్వం ఎలాంటిదో పార్టీ పెద్దలకు తెలుసన్నారు. తనపై జరిగిన తప్పుడు ప్రచారంపై వెన్నంటే ఉన్న పార్టీ పెద్దలకు, సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే నీలిచిత్రాలు వెలుగులోకి రావడంతో మార్చి 3న క్యాబినెట్‌ లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేష్ జార్కిహొళి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ దినేశ్‌ కల్లహళ్లి సంబంధిత వీడియోలపై బాధితురాలికి మద్దతగా రమేష్ జార్కిహొళి పై బెంగళూర్ సీపీకి ఫిర్యాదు చేశారు. బెంగళూరు ఆర్టీ నగర్ కు చెందిన బాధితురాలికి రమేష్ జార్కిహొళి కేపీసీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి లోబరుచున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటూ సంబంధిత సీడీని పోలీస్ అధికారులకు అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed