నేడు పాతబస్తికి బీజేపీ కార్పొరేటర్లు

by Shyam |
నేడు పాతబస్తికి బీజేపీ కార్పొరేటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం మొత్తం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ అంశంపైనే సాగింది. అంతేగాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం కూడా అక్కడినుంచే మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం గ్రేటర్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు పాతబస్తిలోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. 48 మంది కార్పొరేటర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed