- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్ వాటి సంగతేంటి..? నిలదీసిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో జనసేన-బీజేపీల మధ్య పొత్తు ఉంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ప్రధాని మోడీ, అమిత్ షా, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ప్రకటించారు. అంతేకాదు సోము వీర్రాజు ఒక అడుగు ముందుకేసి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీకి మిత్రపక్షం గా ఉంటున్న తరుణంలో కొన్ని అంశాలపై జనసేన పార్టీ స్పందించలేకపోతుంది. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై పోరాటం చేయలేకపోతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి ఉత్తరాంధ్ర ప్రజల నినాదమైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్నికి జై కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇప్పటికే విశాఖలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత మంగళగిరిలో ఒక్కరోజు దీక్ష సైతం చేసిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పవన్ కల్యాణ్ ఉద్యమబాటను ఎంచుకున్నప్పటికీ మిత్రపక్షమైన బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు.
కానీ తొలిసారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక్కటే పవన్ కల్యాణ్‌కు కనిపించిందా అంటూ సెటైర్లు వేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి జనసేన అధినేత ఎందుకు ప్రస్తావించడం లేదో చెప్పాలని ట్విటర్ వేదికగా నిలదీశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పైనా సెటైర్ల వేశారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. నియంత మాదిరి సీఎం జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట లేకుండా పోయిందని ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. 18 వేలకు అమ్ముతున్నారని ఇంతకంటే ఘోరం ఏముంటుందని సోము వీర్రాజు విమర్శించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇప్పటికైనా ఓటీఎస్‌పై సీఎం జగన్ వెనక్కి తగ్గాలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సూచించారు.