- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే ప్రమాణం చేస్తారా : బండి
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటనలో సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి శాసనసభ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడలేదని భద్రకాళి అమ్మవారిపై ప్రమాణం చేయాలని.. తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గులాబీ పార్టీ లీడర్లకు 48 గంటల సమయం ఇస్తున్నాం.. దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించాలన్నారు. అదేవిధంగా దమ్ముంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఓరుగల్లు అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.196 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా మేయర్ ఎన్నిక ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.అంతేకాకుండా, బీజేపీ -టీఆర్ఎస్ ఒకటేననే సంకేతాలివ్వడం కోసమే కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లొచ్చారని… బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి.. వరంగల్ ను ఎంఐఎం అడ్డగా మార్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని కరీంనగర్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.