- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నేతల అరెస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం డికంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ అపహరణ, ధ్వంసం జరిగిన ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నేతలను పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో సమావేశం అనంతరం డికంపల్లికి వెళ్తుండగా.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు డికంపల్లిలో ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న విశ్వ హిందూ పరిషత్ నేతలు సుభాష్ చంద్ర, రాజారత్నంలను బొర్గం వద్ద అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. డికంపల్లిలో ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ, వీహెచ్‌పీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మదాసు స్వామి యాదవ్, ఓబీసీ నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, గంగోనె విఘ్నేష్, కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు భరత్ భూషణ్, గంగొనే గంగాధర్, తదితరులు ఉన్నారు.