- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో ప్రమాదకర సంకేతాలు : వీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో బంకర్లున్నాయా…? ట్యాంకర్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా… బీజేపీ ప్రచారంతో ప్రమాదకరంగా సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. అంతేగాకుండా ఎంఐఎం పార్టీ వ్యవహార శైలి కూడా మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని అన్నారు.
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను కూలిస్తే… ఎన్టీఆర్, పీవీ సమాధులను కూడా కూల్చాలన్న అక్భరుద్ధీన్ ఓవైసీ మాటలను వీహెచ్ తప్పబట్టారు. ఈ సందర్భంగా అక్భరుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అంతేగాకుండా అసదుద్దీన్ ద్వంద వైఖరిని కూడా మైనార్జీలు గమనించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓవైసీ నేత అసదుద్దీన్ ఇద్దరిదీ ఓట్ల రాజకీయమే అని వీహెచ్ స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్‌ది సెక్యులర్ విధానమే అని.. బీజేపీ దుబ్బాక విజయాన్ని చూసుకొని మిడిసి పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన తప్పు దుబ్బాకలో బీజేపీకి కలిసొచ్చిందని అన్నారు.