- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం.. బీజేపీ కార్యకర్తలు అరెస్ట్
దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకుంటే.. అది నచ్చని కొందరు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగారని సీపీ తరుణ్ జోషీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. ఇంటి ఓనర్ కుటుంబ సభ్యురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బీజేపీకి చెందిన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తి తొలుత ఓ వీడియో రూపొందించి పలువురికి పంపించాడని చెప్పారు. ఆ వీడియోను హుజూరాబాద్‌తో పాటు హన్మకొండ జిల్లాకు చెందిన వివిధ వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారని సీపీ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మహిళ గౌరవానికి భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఏడుగురు నిందితులను గుర్తించామని.. వారిలో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తమ గౌరవాన్ని కించపరిచే విధంగా దుష్ప్రచారం చేశారని మహిళ భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి పాల్పడిన నలుగురు నిందితులు బండి సదానందం, వడ్డె రమేష్, వసంతరావు, కడారి వెంకటేష్‌లను అరెస్టు చేసినట్లు తరుణ్ జోషి తెలిపారు. మరో ముగ్గురు సందీప్ ఠాకూర్, సునీల్ గౌడ్, లక్ష్మీ వీరమల్లు పరారీలో ఉన్నారని ఆయన తెలియజేశారు.