- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరిద్వార్‌లో బిపిన్ రావత్ దంపతుల అస్థికల నిమజ్జనం.. కూతుర్లే దగ్గరుండి..!
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ఆర్మీ జనరల్, త్రివిధ దళాలకు అధిపతి (CDS) అయిన బిపిన్ రావత్ అనుకోకుండా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బిపిన్ రావత్ వెంట ఆయన భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన టైంలో సీడీఎస్ రావత్‌తో పాటు ఆమె కూడా మృతి చెందారు. డిసెంబర్ 8న ఆర్మీ హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ ఆయన భార్య, వ్యక్తిగత సిబ్బందితో పాటు తమిళనాడుకు బయలుదేరారు. మార్గమధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది.
ఈ ప్రమాదంలో ఒక్క అధికారి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగతా వారంతా అసువులు బాశారు. ఈ ఘటన ఒక్కసారిగా యావత్ భారతాన్ని షాక్‌కు గురిచేసింది. శుక్రవారం బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య జరుగగా వారి అస్థికలను రావత్ కుమార్తెలు కృతిక మరియు తరిణి హరిద్వార్‌లోని గంగానదిలో శనివారం కలిపారు. వీరి అస్థికలను ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక నుంచి సేకరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరవ్వగా, పూజల అనంతరం కృతిక మరియు తరిణి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేశారు.