ఆర్మీలో బిపిన్ రావత్‌ మార్క్.. దేశ రక్షణే తొలి విధి..

by Shamantha N |   ( Updated:2021-12-08 07:39:49.0  )
bipinrawat
X

దిశ, వెబ్‌డెస్క్ : డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌(IAF MI-17V5) ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తమిళనాడులోని సూలూరు, కోయంబత్తూరు మధ్య డిఫెన్స్ హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది.

దేశ రక్షణే తొలి విధి..

బిపిన్ రావత్ ఓ విలక్షణమైన ఆర్మీ అధికారి. దేశ రక్షణకు సంబంధించి అయినా, యుద్ధ రంగంలో సైనిక పాటవం గురించి అయినా తన అభిప్రాయాలను, సూచనలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు. ఏ పరిస్థితుల్లో అయినా సైనికులు ఒకే రకంగా స్పందించాలని సూచించేవారు. దేశరక్షణ, భద్రతే సైనికుల తొలి విధి అని స్పష్టంగా చెప్పేవారు. సైనిక పటాలంలో మహిళల ప్రవేశం మీద ఆయనకు సానుకూలత ఉండేది.

పురుష సైనికులు, సైనికాధికారులలాగే మహిళా సైనికులు, మహిళా సైనికాధికారులు సమానంగా విధులు నిర్వహించాలని అనేవారు. వారికి ఆ శక్తి ఉందని వాదించేవారు. యుద్ధరంగంలోనూ వారిని భాగస్వాములను చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కూడా ఒక సందర్భంలో చెప్పారు. ప్రత్యేక వసతులు లేకపోయినా మహిళా సైనికులు సరిహద్దుల్లో కాపలా కాయడానికి సిద్ధపడాలనేవారు.

Advertisement

Next Story

Most Viewed