- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లక్షల కోట్లున్నా రోడ్లపై భిక్షం..
దిశ, వెబ్‌డెస్క్: ఆయనకు లక్షల కోట్లున్నాయి.. విలాసవంతమైన జీవితం.. పంచభక్ష పరమాన్నాలు తినే స్థాయి.. కానీ అవేవీ ఆయన్ను సంతృప్తి పరచలేదు. మానసిక ప్రశాంతతనివ్వలేదు. దీంతో దేశం కాని దేశం నుంచి భారత్‌కు వచ్చి భిక్షమెత్తుకుంటున్నాడు. బిచ్చగాడు సినిమాను తలపించేలా ఉన్నప్పటికీ, ఆ సినిమాలో హీరో వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగుపడాలని చేస్తే, ఇక్కడ మాత్రం మానసిక ప్రశాంతతకు చేస్తున్నాడు. అతనే, స్వీడన్‌కు చెందిన కిమ్.. ధనిక పారిశ్రామికవేత్త. ఎంత డబ్బున్నా తనకు మానసిక ప్రశాంతత దొరకలేదు. దీంతో కొన్నినెలల క్రితం కోవైలోని ఈషా యోగా కేంద్రానికి వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించాడు. అయినా, సంతృప్తి పొందలేదు. దీంతో అన్నీ వదిలేసి కోయంబత్తూరు వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నాడు. డబ్బున్న ఓ పారిశ్రామికవేత్త.. అన్ని వదిలేసి, భారత్‌కు వచ్చి బిచ్చమెత్తుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.