- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం తీసిన చలాన్ల భయం.. చివరకు పోలీసులే..!
దిశ, నాగర్‌కర్నూల్ : పోలీసులు చలాన్లు వేస్తున్నారన్న భయంతో వాటిని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన నాగ మల్లేష్ (35) జిల్లా కేంద్రంలో ఆటోమొబైల్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం గుడ్లనర్వ గ్రామానికి చెందిన దామోదర్ అనే మరో వ్యక్తి సాయంతో బైక్ పై జిల్లా కేంద్రం నుండి పెద్ద కొత్తపల్లి వైపు బంధువుల ఇంటికి వెళుతున్నాడు.
చంద్రకల్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసి ఎక్కడ చలాన్లు వేస్తారో అన్న భయంతో అవి తప్పించుకునేందుకు వాహనాలను దాటుకొని వేగంగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొన్నారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి కిందపడిపోగా తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.