అతడితో డేటింగ్ చేస్తా.. పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకుంటా.. వైరలవుతోన్న బోల్డ్ బ్యూటీ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-10-09 16:17:30.0  )
అతడితో డేటింగ్ చేస్తా.. పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకుంటా.. వైరలవుతోన్న బోల్డ్ బ్యూటీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మొదట్లో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న నాగార్జున చెప్పినట్లుగానే తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 ప్రస్తుతం రసవత్తంగా కొనసాగుతోంది. మొదటి 4 వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక 5 వారం ముగింపులో శుభశ్రీ, గౌతమ్‌ను ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ పిలిచాడు. శుభశ్రీ ఎలిమినేట్ అవ్వగా.. గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించాడు. వరుసగా ఐదుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ గమనార్హం.

అలాగే అందరూ ఊహించినట్లే ఈ వారం ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, అశ్విని శ్రీ, హాట్ బ్యూటీ నయని పావని హౌస్‌లోకి అడుగుపెట్టారు. అందులో అందరి దృష్టి ఆకర్షించింది మాత్రం సోషల్ మీడియా సెన్సేషనల్ బ్యూటీ నయని పావని.. ప్రారంభంలో అందరికి అల్లరి పిల్లగా పరిచయమయ్యింది.

ఇక స్టేజ్‌పైకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌ను హౌస్‌లో ఉన్న వారిలో దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? చెప్పాలని నాగార్జున అడగ్గా.. నయని పావని.. ‘‘ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ దమ్ము ఆటగాళ్లని చెప్పింది. అలాగే, అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు దుమ్ము ప్లేయర్లు అని తేల్చి చెప్పేసింది. తర్వాత నాగ్ స్క్రీన్ ‌పై ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజల ఫొటోలను చూపించి.. ఈ ముగ్గురిలో ఎవరితో స్నేహం చేస్తావ్? ఎవరితో డేటింగ్ చేస్తావ్? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్?’’ అని క్వశ్చన్ చేశాడు. దీంతో పావని.. ‘తేజతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ప్రిన్స్‌తో డేటింగ్ చేస్తాను,

ఎందుకంటే చాలా హాట్‌గా ఉంటాడు. అతడికి తెలుగు రాదు. కేవలం హిందీ మాత్రమే వస్తుంది కాబట్టి కనెక్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఇక ప్రశాంత్‌ను పెళ్లి చేసుకుంటాను.’’ అని నాగ్ అడిగిన ప్రశ్నలకు నయని పావని నవ్వుతూ చకచక సమాధానం చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story