బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

by Anjali |   ( Updated:2023-09-07 06:54:35.0  )
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
X

దిశ, సినిమా: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టగా.. అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే.. మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇందులో రితిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్ ఉన్నారు. సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా.. ఈసారి పది ఓట్లు కాకుండా ఒక్క కంటెస్టెంట్‍కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రైతు బిడ్డ ప్రశాంత్ భారీ ఓటింగ్ తో నెంబర్ వన్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఈ వారం ఎలిమినేట్ కాబోయేది కిరణ్ అని టాక్ వినపడుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుగు భాషలో పట్టు లేదు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కూడా ఆమెకు అర్థం అవ్వడం లేదు. అంతేకాదు ఓటింగ్ లో కూడా చాలా వెనుకబడి ఉంది.

Read More : బిగ్‌బాస్‌‌లో రెచ్చిపోయిన శివాజీ.. బీపీ చెక్ చేసి కప్పు కాఫీ ఇచ్చిన కంటెస్టెంట్స్!

పవన్ కల్యాన్‌ ‘ఓజీ’ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Advertisement

Next Story