- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బిగ్ బాస్ కంటెస్టెంట్.. పోటీ ఎక్కడినుంచంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్లు రానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టారు. అంతే కాకుండా అభ్యర్థుల ఎంపికపై పార్టీల నేతలు ఫోకస్ పెంచారు. ఇలాంటి సమయంలో జనసేన, టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు మరెవరో కాదు.. హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచిన శివాజీ.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేసిన శివాజీ.. 2014 రిజల్ట్ తర్వాత కనిపించకుండా పోయాడు. హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శివాజీ.. పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో చాలా నెగిటివిటీని మూటకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ 7 లో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఇంట్లో శివన్నగా నిలిచిపోయాడు. అయితే.. బిగ్ బాస్‌లోకి శివాజీ వెల్లడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు అది నిజం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. బిగ్ బాస్ ద్వారా ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శివాజీ.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీకి సిద్ధం అవుతున్నాడట. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా.. నరసరావు పేట, వినుకొండ ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదొక నియోజకవర్గం నుంచి పోటే చేసే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.