- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి కలను సాకారం చేస్తున్న కూతురు...
దిశ, పెద్దేముల్ : టాలివుడ్ రంగంలో సెన్సేషనల్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టిస్తు సినీ హీరో అక్కినేని నాగార్జున - హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ ఏడో సీజన్లో మొత్తం 14 మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తెలుగు సినీ హీరోయిన్ ప్రియా అలియాస్ రతిక రోజ్, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో పుట్టి పెరిగిన గ్రామీణ ప్రాంత రైతుబిడ్డ. రైతుబిడ్డ నటి రతిక రోజ్ బిగ్ బాస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఎవరి సపోర్టు లేకున్నా సినిమాలే లైఫ్ రా మామ అంటు అంచెలంచెలుగా ఎదుగుతున్న రతిక రోజ్
ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేనప్పటికీ ఇండస్ట్రీలో ఈ అందాల ముద్దు గుమ్మ ప్రియా రతిక రోజ్ పేరుతో ఇప్పుడిప్పుడే ప్రేక్షులముందుకు వచ్చి అలరిస్తుది. పరిస్థితులు అనుకూలించడంతో సినీరంగలో ఎంతో మంది నటులను పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ సూచన మేరకు ప్రియ కాస్త రతిక రోజ్ గా పేరొందారు.
రతిక రోజ్ ఫ్యామిలీ..
రతిక రోజ్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనీ వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామంలో జన్మించింది. తండ్రి రాములు యాదవ్, తల్లి అనితారాణి. తండ్రీ రాములు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తూ, క్రియాశీల రాజకీయాలలో ఉన్నారు. రాములుకు ప్రవళిక, ప్రియా (రతిక రోజ్), ధరణి, అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
తెలుగు, తమిళ సినిమాలు, ప్రముఖ షోలలో నటించిన రతిక రోజ్
హీరోయిన్ రతిక మొదటగా పటాస్ ప్రియగా బుల్లి తెర పై ప్రేక్షకులను అలరించి కమెడియన్ బిత్తిరిసత్తితో కలిసి తీసిన తుపాకీ రాముడు సినిమాలో హీరోయిన్ గా నటించి సినిమా ప్రపంచానికి పరిచమయ్యింది. ఆ తర్వాత కార్తీకేయ 2, ఖయ్యుం నారప్ప, దృశ్యం 2 తదితర సినిమాల్లో నటించింది. తాజాగా బెల్లంకొండ హీరోగా నటించిన "నేను స్టూడెంట్ సార్" అనే సినిమాలో పోలీసు అధికారిగా, హీరో సాయికుమార్ కుమారుడితో అథితి దేవోభవా, శకలక శంకర్, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, బాలకృష్ణ, సినిమాలో రాజకీయ నాయకురాలిగా అలాగే తమిళంలో 2 సినిమాలలో అలరించారు. ఇలా ఎన్ని సినిమాలో నటించినా, ఎన్ని షోలు చేసినప్పటికి పూర్తిస్థాయిలో సరైన గుర్తింపు రాకపోవడంతో బిగ్ బాస్ లో రావడంతో తెలుగు ప్రజలకు మరింత చేరువ కావొచ్చనే సంకల్పంతో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టినట్లు స్వయంగా హోస్ట్ నాగార్జునతో తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే.
తండ్రి కలను సాకారం చేస్తున్న కూతురు రతిక రోజ్
బిగ్ బాస్ షోలో అలరిస్తున్న రతిక రోజ్ (ప్రియా) తండ్రి రాములు యాదవ్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలము జనగాం గ్రామంలో రైతుగా రాజకీయ నాయకుడిగా జీవనం సాగిస్తున్నారు. రాములు యాదవ్ కు సినిమా రంగంపైన ఎంతో మక్కువతో తెలుగు నటుడిగా కావాలని చాల ఆశలున్న కొన్ని అనివార్య కారణాల వల్ల నటన రంగానికి దూరంగానే ఉండిపోవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాను నటుడిగా కాకపోయినా తన కూతురు రతిక రోజ్ తనకున్న నటన కళను నెరవేర్చడానకి కృషి చేస్తుందని రతిక రోజ్ తండ్రి రాములు యాదవ్ సంతోషంలో మునిగిపోయారు.
బిగ్ బాస్ షోలో ఏదో ఒక ఆక్టివిటీతో ప్రేక్షకులకు చేరువ కావడానికి ప్రయత్నం..
తన అందంతో, డ్యాన్స్ లు, పాటలు పాడుతూ ఏదో ఒక ఆక్టివిటీతో బిగ్ బాస్ హౌస్ లో తెలుగు ప్రజలను అలరించాలని రతిక రోజ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రియాలిటీ షో బిగ్ బాస్ వేదిక ద్వారా వికారాబాద్ జిల్లా అభిమానులకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చేరువుతుంది.
ఓటింగ్ విధానంతో రతిక రోజ్ కు సపోర్ట్ చేద్దాం..
రతిక రోజ్ ను బిగ్ బాస్ షోలో ఫాలో అవుతూ అవకాశం వచ్చినప్పుడల్లా ఓటింగ్, ఇతరత్రా పలు అంశాలలో ఆమెకు సపోర్టుగా ఉందామని తండ్రి రాములు, జిల్లా వాసులు కోరుతున్నారు. నటి రతిక రోజ్ బిగ్ బాస్ షోలో బాగ ఆడి పేద రైతు తండ్రి కోరికను, జిల్లా ప్రజల కోరికను నెరవేర్చాలని మనసారా కోరుకుందాం.