- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరంతా బఫూన్స్ అంటూ హౌస్‌మేట్స్‌పై రతిక ఫైర్.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు చాలా మంది తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ షో ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకుని రెండో వారం నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగాయి. ఈ క్రమంలో హౌస్‌లో మొదటి వారం పవరాస్త్రను గెలుచుకున్నాడు సందీప్. ఇక రెండో వారం రెండో పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్ గా విడిపోయారు. రణధీర అని పేరు పెట్టుకున్న శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్, అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి టీమ్ చాకచక్యంతో ఆడి.. మాయాస్త్రాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు రెండో పవర్ అస్త్రా కోసం ఈ టీమ్ లో పోటీ మొదలయ్యింది. అసలు పవర్ అస్త్రా ఎవరికి దక్కితే బాగుంటుంది అనే విషయాన్ని అవతలి టీమ్ అయిన మహాబలి డిసైడ్ చేసే ఛాన్స్‌ను బిగ్ బాస్ ఇచ్చినట్టుగా తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు.
ప్రస్తుతం మాయాస్త్రానికి సంబంధించిన రెండు తాళం చెవులు మహాబలి టీమ్ దగ్గర ఉండడం కూడా ఈ ప్రోమోలో కనిపించింది. అలాగే మహాబలి టీమ్‌లో ఒక్కొక్కరుగా వెళ్లి.. రణధీర టీమ్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కి పవర్ అస్త్రా దక్కితే మేలు అన్న విషయాన్ని చెప్పాలి. దీంతో మహాబలి టీమ్‌లో డిస్కషన్ మొదలయ్యింది. ఎవరు ముందు వెళ్లాలి, ఎవరు తర్వాత వెళ్లాలి అని చర్చించుకున్నారు. మహాబలి టీమ్ నుంచి వచ్చిన శుభశ్రీ.. శోభా నుంచి తాళంచెవిని తీసుకొని ప్రిన్స్‌కు ఇవ్వాలని చెప్పింది. ఇక అమర్ దీప్ కూడా మహాబలి టీమ్ మెంబర్స్ చెప్తున్న కారణాలకు సమాధానాలిచ్చాడు. ఇంతలోనే మహాబలి టీమ్‌లో తర్వాత ఎవరు వెళ్లాలి అనే చర్చ మొదలయ్యింది. దీని వల్ల వారి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. చివరిగా వెళ్లే కంటెస్టెంట్ చేతిలో పవర్ అస్త్రా ఎవరి చేతికి వెళ్లాలో డిసైడ్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి రతిక.. తను చివరిగా వెళ్తానని చెప్పింది. దానికి ఆ టీమ్ సభ్యులు అసలు ఒప్పుకోలేదు. దీంతో దామినిపై ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది రతిక.
మహాబలి టీమ్ అంతా చర్చించుకొని, వాదించుకున్న తర్వాత కూడా చివరికి ఎవరు వెళ్లాలి అనేది నిర్ణయించుకోలేక పోయారు. సహనం కోల్పోయిన రతిక ‘‘‘నాకు చండాలంగా అనిపిస్తుంది ఈ టీమ్‌లో ఉండడం. బఫూన్స్’’ అంటూ కామెంట్ చేసింది. ‘‘రెండురోజుల నుంచి అదే టీమ్‌లో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా ఇది నా టీమ్ కాదు వీరంతా బఫూన్స్ అంటున్నావు’’ అంటూ సందీప్ తనపై అరవడం మొదలు పెట్టాడు. అలా అన్న తర్వాత కూడా రతిక.. ‘‘అవును అలాగే ప్రవర్తిస్తున్నారు’’ అంటూ సమాధానమిచ్చింది. అలా చాలాసేపు మహాబలి టీమ్ నుంచి చివరిగా వెళ్లాల్సిన కంటెస్టెంట్‌ను డిసైడ్ చేయలేకపోవడంతో గౌతమ్ కృష్ణ, అమర్ దీప్, సందీప్, శోభాశెట్టి కూడా సహనం కోల్పోయారు. ‘‘గేమ్ ఆడడం రాదు’’ అంటూ అరిచాడు అమర్ దీప్. మొత్తానికి మహాబలి టీమ్ ప్లే చేస్తుంది స్ట్రాటజీ నా, లేక నిజంగానే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయా అనే విషయం తెలుసుకోవాలంటే నేడు ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది.