Bigg Boss 8: బిగ్‌బాస్‌కు హగ్‌ల కోసం వచ్చావా..? గేమ్ ఆడటానికి వచ్చావా.. అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్స్

by Prasanna |
Bigg Boss 8: బిగ్‌బాస్‌కు హగ్‌ల కోసం వచ్చావా..? గేమ్ ఆడటానికి వచ్చావా.. అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏడు సీజన్లు వియవంతంగా పూర్తి చేసుకుని ఎనిమదవ సీజన్ కి ఇటీవలే ప్రారంభమైంది. షో మొదలవ్వక ముందు వరకు టాక్ ఒకలా ఉంటుంది.. ఒక్కసారి మొదలయ్యాక టాక్ మొత్తం బయట మారిపోతుంది. బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్

ఒకర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు .. అలాంటి వారికీ బయట క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది.. ఇక ఈ సీజన్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ను మణికంఠ జనాల్లోకి బాగా ఎక్కించేసాడు.. వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు.. అయితే , తాజాగా నెటిజెన్స్ మణికంఠ మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ షో ఎప్పుడు ఎలా ఉంటుందో .. ఎవరు కూడా గెస్ చేయలేరు. సీజన్ సీజన్ కి మొత్తం మారిపోతుంది. ఈ సీజన్ అయితే రూల్స్ మొత్తం మార్చేశారు. సోలో ఎంట్రీ లేదంటూ జంటలుగా పంపించారు. వారిలో ఇక మణికంఠ అయితే మొదటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ కొందరు మండిపడుతున్నారు.. ఇక, తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాగ్ ల కోసం బిగ్ బాస్ లోకి వెళ్ళావా లేక ఆట ఆడటానికి వచ్చావా అంటూ మణికంఠను నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు.

Next Story

Most Viewed