- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్‌లో ఉన్న నా కొడుకుకి ఓటేయాలని కోరిన హీరోయిన్ రాశి.. (వీడియో) కోడలు వద్దా అని ఆడేసుకుంటున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 చాలా డిఫరెంట్‌గా కొనసాగుతోంది. ఈ సారి ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతుండగా.. వారికి సపోర్ట్‌గా బయట ప్రేక్షకులు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిదో వీకెండ్ వరకు వచ్చేసింది. తాజాగా, అమర్ దీప్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ ఒకప్పటి హీరోయిన్ రాశి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం నేను రాశి. బిగ్‌బాస్-7 లో నా కొడుకుగా నటించిన అమర్ దీప్‌కే నా సపోర్ట్. మీరు కూడా సపోర్ట్ చేసి అమర్‌కే ఓటు వేయండి’’ అని చెప్పుకొచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది చూసిన కొందరు అసలు అమర్‌కు సరిగా మాట్లాడడమే రాదు, ‘దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మీ కోడలుగా నటించిన ప్రియాంకకు సపోర్ట్ చేయరా అని ఆడేసుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం రాశిని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాశి, అమర్ దీప్, ప్రియాంక కలిసి బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో నటించారు. ఇందులో రామాకు తల్లిగా రాశి నటించగా.. జానకిగా ప్రియాంక నటించింది. అమర్ దీప్‌తో పాటు ప్రియాంక కూడా బిగ్‌బాస్- 7 లోకి వెళ్లిన విషయం తెలిసిందే.