- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిస్ ఇచ్చాడు.. అబ్బాయిలతో మాట్లాడితే కొప్పడ్డాడు.. రైతుబిడ్డపై Rathika సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అయిన బిగ్‌బాస్ రియాలిటీ షోను నిర్వహకులు మరింత ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇటీవల ఏడవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య జరిగే సన్నివేశాలు ఎంతలా హైలెట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. షో ప్రారంభంలో నవీన్ పొలిశెట్టి వచ్చి పల్లవి ప్రశాంత్‌ను నీ లక్కీ లేడీ ఎవరని అడగ్గా అతను రతిక అని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడింది. కానీ ఈ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో చిన్న గొడవ కారణంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు.
తాజా ఎపిసోడ్‌లో రతిక, పల్లవి ప్రశాంత్‌తో వాదనకు దిగిందట. అసలు ఏ ఉద్దేశంతో నాతో ఓవర్‌గా బిహేవ్ చేశావని ప్రశ్నించిందట. దీనికి అతడు ‘నిన్ను చూడగానే మనోళ్ల అమ్మాయి అనిపించింది. అందుకే కొంచెం క్లోజ్‌గా ఉన్నాను. అప్పుడప్పుడు మజాక్ చేశాను’ అని చెప్పాడు. ఈ మాటలకు ఒప్పుకోని రతికా అతడి గురించి ఎన్నో విషయాలను బయట పెట్టేసిందట. ‘నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు నా పేరు ఎందుకు రాశావు? ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇచ్చావు? పొట్టి బట్టలు వేసుకోవద్దని నువ్వు చెప్పలేదా? దామినిని వదినా అని పిలవమన్నావు.. సందీప్ మాస్టర్, అమర్‌దీప్‌తో మాట్లాడుతుంటే కోప్పడ్డావు. మగాళ్లతో ఉంటే లాక్కుని వచ్చేశావు’ అని ఆరోపించింది. దీంతో ప్రశాంత్ ఆమెకు క్షమాపణ చెప్పి దీనికి పుల్‌స్టాప్ పెట్టేశాడని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : ఒక మొక్కను చూసుకోలేనివాడు రైతు బిడ్డా ..? పల్లవి ప్రశాంత్‌పై నాగార్జున ఫైర్