బిగ్‌బాస్-7: బెడ్‌రూమ్‌లో అర్ధరాత్రి మళ్లీ మొదలుపెట్టిన రతిక-ప్రశాంత్.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-10-10 15:53:49.0  )
బిగ్‌బాస్-7: బెడ్‌రూమ్‌లో అర్ధరాత్రి మళ్లీ మొదలుపెట్టిన రతిక-ప్రశాంత్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాల్టీ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ప్రస్తుతం 7వ సీజన్ ప్రసారమవుతుంది. అయితే ఇందులో పల్లవి ప్రశాంత్, రతిక ఎంత రచ్చ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కాస్త చనువుగా ఉంటూ షోపై అందరికీ ఆసక్తిని పెంచుతున్నారు. అయితే ఇటీవల నాబినేషన్స్‌లో రతిక, ప్రశాంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

తాజాగా, బిగ్‌బాస్ బగ్‌లో విడుదలైన వీడియోలో మళ్లీ వీరిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి వేళ.. పక్కన ఎవరూ లేని సమయంలో.. బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్‌కు అటువైపుగా ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు. ''కొంచెం ముందుకు రా'' అని ప్రశాంత్ అడగడంతో ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమో మొదలయ్యింది. ''డ్యాన్స్ రాదని బాగానే డ్యాన్స్ చేశావు'' అంటూ రతిక.. ప్రశాంత్‌ను పొగిడింది. దానికి ప్రశాంత్ సరదాగా డిస్కో డ్యాన్సర్ అంటూ పాట పాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు సరదాగా చేతులతో ఆడుకున్నారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన రతిక బేబీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.. షకీలా సంచలన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed