- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIGG BOSS-7: శివాజీకి మరో ప్రమాదం చికిత్సకు తరలింపు.. సంచలన ప్రకటన చేసిన బిగ్‌బాస్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో అందరి ఆదరణ పొందుతూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏడో సీజన్ సక్సెస్ ఫుల్‌గా తొమ్మిదో వారం వరకు వచ్చేసింది. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు టాస్కులు ఇచ్చి వారి బలాన్ని చెక్ చేస్తున్నాడు. అయితే 9వ వారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. ఇందులో హాల్ ఆఫ్ బాల్ అనే టాస్కును బిగ్‌బాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడదీశారు. యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిని గర్జించే పులులు జట్టుగా చేశారు. తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కులో పాల్గొనే అర్హతను వీర సింహాలు టీమ్ సభ్యులు పొందారు. వీళ్లకు గతంలో ఓ సీజన్‌లో నిర్వహించినట్లుగా బీన్ బ్యాగ్ టాస్కును ఇచ్చారు. అయితే, అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ.. ఈ టాస్కులో వీర సింహాలు టీమ్ సభ్యులకు బదులుగా గర్జించే పులులు ఆడాల్సి ఉంటుందని తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ చెప్పాడు.
బిగ్ బాస్ ఆదేశం మేరకు వీర సింహాలు టీమ్ సభ్యులకు బదులుగా ఈ టాస్కును గర్జించే పులులు సభ్యులైన శివాజీ, అమర్‌దీప్, భోలే షావలి, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్‌లు గేమ్ ఆడారు. ఇక, ఇందులో శోభా తరపున ఆడిన అమర్‌దీప్ తనలోని వైల్డ్ యాంగిల్‌ను చూపించాడు. ముఖ్యంగా అతడు భోలే, అశ్వినిలను బాగా టార్గెట్ చేసి విరుచుకుపడ్డాడు. ఇక అర్జున్ తరపున ఆడుతున్న శివాజీ బ్యాగ్‌ను అమర్ బలవంతంగా లాక్కునే క్రమంలో శివాజీకి మరోసారి గాయం అయింది. అది గమనించిన తేజ శివాజీని పట్టుకుని వెంటనే మెడికల్ రూమ్‌కు తీసుకుని వెళ్లాడు. ఆయనను చికిత్స కోసం వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ఆడుతుండగా బిగ్‌బాస్ సంచలన ప్రకటన చేశాడు. ‘‘శివాజీ శారీరకంగా సిద్ధంగా లేని కారణంగా ఈ టాస్క్ నుంచి తప్పుకుంటున్నారు’’ అని చెబుతాడు. అయితే శివాజీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.