ఈసారి బిగ్‌బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఏకంగా 10 క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ.. ఎవరంటే?

by Anjali |   ( Updated:2024-10-01 05:53:46.0  )
ఈసారి బిగ్‌బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా..  వైల్డ్ కార్డ్ ద్వారా ఏకంగా  10 క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ.. ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 రియాలిటీ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్లతో డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులు ఆడిస్తూ.. జనాల్ని అలరిస్తున్నారు. రాత్రి 9. 30 అయితే చాలు బిగ్ బాస్ లవర్స్ అంతా టీవీల్లో ముఖాలు పెడతారు. ఇక నాగార్జున ప్రతి వారం వచ్చి కంటెస్టెంట్ల తప్పొఒప్పులు చెబుతారు. హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ప్రజెంట్ 10 మెంబర్స్ ఉన్నారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఎలిమినేట్ అయ్యారు. కానీ కంటెస్టెంట్లు టాస్కుల విషయంలో మరీ దారుణంగా గొడవపడటం ఏంటి? అని నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ప్రతి సీజన్‌లో హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాగా ఈసారి ఏకంగా బిగ్‌బాస్ గట్టి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం పాతవాళ్లనే దింపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా ఒక్కరు కాదు ఇద్దరూ కాదు.. ఏకంగా మొత్తం పది మందిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. యాంకర్ రవి అండ్ గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్‌, నయని పావని, శోభా శెట్టి, రోహిణి, హరితేజ, జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి హరితేజ పేర్లు వినిపిస్తున్నాయి. హౌస్‌లోకి కనుక వీళ్లంతా ఎంట్రీ ఇస్తే ఊహించని రేటింగ్‌లో బిగ్‌బాస్ దూసుకుపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story